తరచుగా అడిగే ప్రశ్ర్నలు

 1. పద్యం రచనకు ఏ విధంగా సహాయకారి?

  పద్య రచనకు ఎంతో సృజనతో పాటుగా ఛందోనియమాల (లక్షణాల) ధారణ, గణాల, యతిప్రాసల గణన ప్రక్రియపై పట్టు కూడా ఉండాలి. దానికి ఎంతో అభ్యాసం కావాలి. ఎంత అభ్యసించినా అప్పుడప్పుడు కొన్ని దోషాలు దొర్లడం సహజం. అటువంటప్పుడే వీటన్నింటినీ సరిచూడగలిగితే బావుండును అన్న ఆలోచనే ఈ సాధనం.

  పద్యరచన ప్రక్రియను ముందు తరాలకు అందించాలంటే ఈ తరానికి పద్యరచనకు ఉపకరించే సాంకేతిక సాధనాలను కూడా అందించాలి. అటువంటి ప్రయత్నమే .

  ఎందరో మహానుభావులు: అష్టావధాన, శత, సహస్ర అవధానాలు చేసేవారికి ఇటువంటి సాధనం అవసరం లేకపోవచ్చు. ఈ పరికర అభివృద్ధిలో అటువంటివారు పాలుపంచుకుంటే ముందు తరాలకు పద్యసాహిత్య ప్రక్రియను తీసుకువెళ్ళడంలో ప్రయత్నం చేయవచ్చు.

 2. పై పద్య రచనలో ఎంతవరకూ ఆధారపడవచ్చు?

  ను అన్ని రకాల ఛందోనియమాలను పరిగణనలోకి తీసుకొని నిర్మించడం జరిగింది. దగ్గరదగ్గర 11,000 వ్యక్తిగతంగా పద్యాలను సరిచూసాను. పద్యరచయితలు వ్యక్తిగతంగా వాడుతున్నారు. అయినప్పటికీ కొన్ని నియమాలను ప్రస్తుతానికి ఉన్న సాంకేతిక పరిధుల వల్లనో లేదా నా అవగాహనాలోపంవల్లో దోషం కానిదానిని దోషం అనో లేదా దోషాన్ని దోషంకాదనో చూపించే అవకాశం ఉంది. అటువంటివాటిని నాదృష్టికి తెస్తే సరిదిద్దుకోగలను. అందించే దోషాలను పరిగణనలోకి తీసుకొని వ్యక్తిగత విచక్షణతో సరిదిద్దుకోవచ్చు లేదా ignore చేయవచ్చు కానీ అటువంటి అవసరం తక్కువే. ఏసాంకేతిక సాధనం లేదా /యంత్రము వ్యక్తిగత విచక్షణకు ఏమాత్రం సాటిరావు అన్నది నగ్నసత్యం. అందులోనూ పద్యరచన అనేది ఒక సృజనాత్మకమైన కళ.

 3. గణం తప్పని చెబుతోంది. కానీ ఇది సరైన పాఠం అని నాకు తెలుసు.

  సాధారణంగా సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువు అవుతుంది, అది వేరే పాదంలో ఉన్నా సరే. తెలుగులో సమాస పదాలను కలిపే వ్రాస్తాము అంటే సమాసం పూర్తయ్యేవరకూ మధ్యలో space ఉండకూడదు.ముద్రిత ప్రచురణలలో సంధుల, సమాసాల చదువుకోడానికి / అర్థం స్ఫురించుటలో అనుకూలత మున్నగువాని కోసం సంధి/సమాస పదాల మధ్యలో కూడా ఖాళీలు ఉంచటం అన్నది వాడుకలో ఉంది. అయినప్పటికీ సంధి లేదా సమాసాల మధ్య ఖాళీ ఉంచడం అన్నది సమంజసంగా నాకు అనిపించదు. ఎందుకంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఒకేపదంగా ఏర్పడినపుడే సంధి/సమాసం అని పిలుస్తాము. నాకు తెలిసీ సంధి/సమాసాల మధ్య ఖాళీ లేకుండా వ్రాయడమే తెలుగు వ్యాకరణ సాంప్రదాయం, యొక్క పరిధీనూ.

 4. కానీ ఇక్కడ తప్పు చూపిస్తున్న చోట సమాసం

  తెలుగు-సంస్కృత పదాల మధ్య space ఉంచము. ఏది తెలుగో, ఏది సంస్కృతమో గుర్తించే సామర్థ్యం కు లేదు.అందువల్ల space లేదా comma పెట్టి చూడండి.

  అద్రుచు, కద్రుచు వంటి పదాలలో ద్రు ముందున్న అక్షరం గురువు కాదు. కానీ ఛందం వీటిని గురువుగా గుర్తిస్తుంది ఇలాంటప్పుడు 'అ ద్రుచు' వ్రాయాల్సి ఉంటుంది. అప్పటికీ తప్పుగానే చూపిస్తే నాకు mail చేయండి. నేను సహాయ పడగలను. ఇది ఛందంకు వున్న కానీ వ్యాకరణ నియమం కాదు.

 5. ఎందువల్ల? నాకు ఈ పద్య ఛందస్సు ఏమిటో ఖచ్చితంగా తెలుసు కానీ తప్పుగా చూపిస్తోంది.

  1. కొన్ని పద్యాలకు ఒకటి కంటే ఎక్కువ ఛందస్సులు ఒకేసారి సరిపోవచ్చు.ఉదా: ఉత్సాహము , సుగంధి పద్యాలు. మరిన్ని వివరాలకు చూడండి. సాధారణంగా మాత్రాగణ లేదా అక్షరగణ ఛందస్సులలో వ్రాసిన పద్యాలు కలిసే అవకాశం ఉంది.
  2. కచ్చితమైన పద్య ఛందస్సు అని తెలిసినపుడు ఆ ఛందస్సు select చేసుకొని '' అనే బొత్తాన్ని నొక్కండి.
  3. సమీప ఫలితాల్లో కనుక మీరు కోరుకున్న ఛందస్సు కనుక ఉన్నట్టైతే ఆ ఛందస్సును పై నొక్కి అనే బొత్తాన్ని నొక్కండి.
  4. లేకపోతే అనే బొత్తాన్ని నొక్కండి.
  5. అక్కడ కూడా మీరు కోరుకున్న ఫలితం లేక పోతే తీసి వేసి ప్రయత్నించండి.

 6. నాకు తెలిసీ యతి మైత్రి ఖచ్చితముగా సరైనదే కానీ తప్పుగా చూపిస్తోంది.

  యతి మైత్రి గణనం పూర్తిగా దోషరహితము కాదు అలాగనీ పూర్తిగా దోషపూరితమూ కాదూ. ముఖ్యంగా సంధి మూలక యతులను గుర్తించడములో విఫలము అవుతుంది. కానీ ప్రయోగాత్మకముగా ప్రక్రియ ఉపయోగించుకొనే అవకాశం కలదు.ఇది ఒక ప్రయోగాత్మకమైన పద్దతి.యతి స్థానం లో ఉన్న అక్షరాల స్వరాలు మాత్రమే ఆధారంగా యతిని సరిచూడబడుతుంది. వాటిని పట్టి ఉంచిన(hold) చేస్తున్న హల్లులను ఎంత మాత్రమూ పరిగణించదు. ను తీసివేసి మరలా గణించవచ్చు.

 7. నావద్ధ పాత పుస్తకాలు , పద్యాలు చాలా ఉన్నాయి, వాటిని డిజిటైజ్ చేస్తున్నాను నాకు ఏవిధంగా ఉపయోగ పడుతుంది?

  లో ఉన్న అతి పెద్ద సవాలు అక్షరదోషాలు. పద్య రచనలో ఉన్న మరో గొప్ప విశేషం , ఏవిధమైన అక్షర దోషం కనుక ఉన్నటైతే గణ,యతి,ప్రాస లో ఏదో ఒకటి దోష పూరితం గా మారుతుంది. అటివంటి వాటిని చాలా సులువుగా గుర్తించగలదు. ఈ విధంగా డిజిటైజ్ చేయబడిన

  1. తెలుగు భాగవతం లోని 9000+ పద్యాలలోని అక్షర దోషాలను గుర్తించడములో సహాయపడింది.
  2. తెలుగు వికీపిడియా మరియూ పబ్లిక్ డొమైన్ లో ఉన్న శతకాలలోని దోషాలను ఏవిధంగా గుర్తించందో నిదర్శనాధ్యయనాలు లో చూడండి.

 8. అన్నేసి పద్యాలను ఒకేసారి ఎలా సరిచూడాలి?

  అభ్యర్ధన మేరకు నాకు పంపితే దోషాల లిస్టు పంపగలను. దీనిని మీరే run చేసుకొనేలా ఒక application తయారు చేయబడుతోంది. వేచిచూడగలరు.

 9. నేను పద్యాలు తరుచుగా వ్రాస్తాను.

  మీరు రాసే కొత్త పద్యాలను లో గణించుకోవచ్చు. ఇది గణనమును outsource చేస్తుంది.

  ఈ పరికర అభివృధ్ధి లో మీలాంటి వారి పాలుపంచుకుంటే ముందు తరాలకు పద్య సాహిత్య ప్రక్రియను అందించడంలో మనప్రయత్నం చేయవచ్చు.

 10. నేను ఛందస్సు ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.నాకు ఏవిధంగా సహాయ పడగలదు.

  ఛందోరాజం,ఛందోరత్నావళి అని రెండు పుస్తకాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని ఛందస్సును నేర్చుకోవచ్చు. ప్రయోగాలు అనే సెక్షన్ లో యతి,ప్రాస లను సరి చూసుకోవడమే కాక అవి ఏరకమైన యతి,ప్రాసలో కూడా తెలుసుకోవచ్చు.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.