ఉత్సాహము పద్య లక్షణములు

 1. జాతి రకానికి చెందినది
 2. 15 నుండి 22 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ఏడు సూర్య , ఒక గురువు గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
   భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్
   నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
   ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.
  2. చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో
   స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
   దారుణప్రతాపసాల్వదండనాథమండలిన్
   మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.
  3. కామరూపధారులుం బ్ర కాశమాన తేజులున్
   ధీమతుల్ ప్రధాయుతుల్ సుధీరతావిరాజియుల్
   భీమవేగభూరిశౌర్య విక్రమేడ్యయూథపుల్
   భూమిశతసహస్రశతము పుట్టి క్రాలు చుండఁ గన్
  4. సాహచర్య మమర సప్త సవితృవర్గమును సము
   త్సాహ మెక్క నొక్కగురుఁడు చరణములు భజింపఁగా
   నీహితప్రదానలీల లెసగుకమఠమూర్తి ను
   త్సాహరీతు లుల్లసిల్ల సంస్తుతింతు రచ్యుతున్.
  5. చలికి వణకె చేతు లిచట చలికి కాళ్ళు వణకెరా
   చలికి వణకె పెదవు లిచట చలికి నోరు వణకెరా
   చలికి వణకె నంగము లిట చలికి తనువు వణకెరా
   చలియు యింట చలియు బయట చలికి జగతి వణకెరా

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.