ఉత్పలమాల పద్య లక్షణములు

 1. వృత్తం రకానికి చెందినది
 2. కృతి ఛందమునకు చెందిన 355799 వ వృత్తము.
 3. 20 అక్షరములు ఉండును.
 4. 28 మాత్రలు ఉండును.
 5. మాత్రా శ్రేణి: U I I - U I U - I I I - U I I - U I I - U I U - I U
 6. 4 పాదములు ఉండును.
 7. ప్రాస నియమం కలదు
 8. ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థానము
 9. ప్రతి పాదమునందు భ , ర , న , భ , భ , ర , వ(లగ) గణములుండును.
 10. ఉదాహరణలు:
  1. పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
   రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
   వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
   ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్
  2. ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
   మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
   దేహముబోదు దేహి క్రియ దీనదశన్ గజ ముండె భీషణ
   గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్
  3. ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
   యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
   బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
   డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
  4. భానుసమాన విన్ బరన భారలగంబుల గూడి విశ్రమ
   స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
   పద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః
   పద్మవికాస హేతువగు పద్యము నుత్పలమాలయం డ్రిలన్
  5. శ్రీరమణీముఖాంబురుహ సేవన షట్పద నాథ యంచు శృం
   గార రమేశ యంచు ధృత కౌస్తుభ యంచు భరేఫనంబులన్‌
   భారలగంబులుం గదియఁ బల్కుచు నుత్పలమాలికాకృతిన్‌
   గారవమొప్పఁ జెప్పుదురు కావ్యవిదుల్‌ యతి తొమ్మిదింటఁగాన్‌.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.