తురగవల్గన రగడ పద్య లక్షణములు

 1. జాతి(రగడలు) రకానికి చెందినది
 2. 16 నుండి 24 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. అంత్య ప్రాస నియమం కలదు
 6. ప్రాస యతి నియమం కలదు
 7. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 8. ప్రతి పాదమునందు ఎనిమిది 3 మాత్రలు గణములుండును.
 9. ఉదాహరణలు:
  1. దశరథావనీశ విమలతర తపఃఫలావతార
   నిశిత శర లఘుప్రయోగ నిహత తాటకా విహార
   కపట పటు సుబాహు దశన ఘటిత గాధిసూను యాగ
   అపరిమేయ గౌతమాంగనాఘ దమన పద పరాగ
   కోమలేక్షు దళన సదృశ ఘోర శంభు చాప భంగ
   భూమిజా వివాహ విభవ పూర్ణ సమ్మదాంతరంగ
   పరశురామ గర్వ పవన పాప పీన బాహు నాగ
   గురు వచోఽనుపాల నాతి కుతుక విధుత రాజ్యభోగ
   పాద భజన వితరణాతి ఫలిత గుహ సమస్త పుణ్య
   పాదుకా ప్రదాన విహిత భరత సౌహృదానుగుణ్య
   ఘన విరాధ మద వినాశ కలిత బహు విపన్నిరాస
   వినుత పద నివేశ పూత వివిధ మౌని కుల నివాస
   తత నిశాచరీ విరూపతా కృతప్రియా వినోద
   అతుల బల ఖరాది దనుజ హనన జనిత విబుధ మోద
   హరిణ రూప ధారి దారు ణాసు రాసు హరణ బాణ
   పరమ ఘోర బాహుబల కబంధ మర్దనప్రవీణ
   అమల శబరికా ఫలోపహార రుచి ఘనాభిముఖ్య
   సమద వాలి దర్ప దమన సఫలితార్క తనయ సఖ్య
   శరణ వరణ పర పరానుజప్రదీపితప్రసాద
   అరుణితాక్షి కోణ విరచితాంబురాశి గర్వ సాద
   పర్వతౌఘ రచిత సేతు బంధ సుతర సింధు కాండ
   గర్వ పంక్తికంఠ కంఠ ఖండనప్రచండకాండ
   సకల దివిజ నుత చరిత్ర సాధు భవ లతా లవిత్ర
   సకరుణా తరంగ నేత్ర జానకీ మనోజ్ఞ గాత్ర
   యతి జపార్హ పుణ్య నామ యతి వితీర్ణ భక్త కామ
   సతత సిత యశోఽభిరామ సర్వలోక పూర్ణ ధామ
   అహిత విదళ నాతి రౌద్ర యార్త పాలనా వినిద్ర
   మహిత నిఖిల గుణ సముద్ర మమ్ము బ్రోవు రామభద్ర

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.