తరువోజ పద్య లక్షణములు

 1. జాతి రకానికి చెందినది
 2. 22 నుండి 30 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 3,5,7 గణముల మొదటి అక్షరములు యతి స్థానములు
 6. ప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. ఏ నెల్ల ప్రొద్దు నా యెడ లోనఁ దలఁతు నీయభిప్రాయంబ యిది దారుణంబు
   గాన వాకునకుఁ జుల్కన తేరనోపఁ గడఁగి పాండవుల నేకత మెట్టు లనుప
   గా నగు మఱి దీని గాంగేయవిదురకలశజాశ్వత్థామ గౌతముల్ బుద్ధి
   గా నొడంబడుదురె కాదయ్య యనినఁ గౌరవజ్యేష్ఠుండు ఘనుఁ డిట్టు లనియె.
  2. నలనామకంబులు నగణాంతములుగ నాలుగంఘ్రులయందు నాలుగుఁగూర్చి
   వళులు మూఁడెడలను వరుసతో నిల్ప వలయు మూఁడవగణవర్ణంబు మొదల
   నిలుపంగ నివ్విధి నిర్మించి విశ్వనృపతికి నిచ్చిన నింపుసొంపారుఁ
   దలకొని తగఁ బ్రాలు దంపెడిచోటఁ దరుణులచే సొంపుదనరుఁ దర్వోజ
  3. ఈ విల్లు మోపెట్టి యేను బాణముల నీ యంత్రమత్స్యంబు నేసిన వాఁడ
   భావజప్రతిముఁ డిబ్బాలకుఁ దగిన పతి యిది మునిశక్తిఁ బడసిన విద్య
   గావున మీ రిప్డుగావింపుఁ డిదియ ఘనతర కార్ముక కౌశలోన్నతియు
   లావును గలవారలకు నవసరము లలితయశంబుఁ గల్యాణంబుఁ బడయ.
  4. ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత దండవిధానంబుఁ దప్పక ధర్మ
   చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
   వరుసన తమతమ వర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
   నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగు మహీవల్లభు ననుశాసనమున.
  5. వెండి వెన్నెల కాచి వెలుగు జాబిల్లి వెండి కొండను నిల్చె విశ్వేశుపైన
   పండు వెన్నెల తోడ పరవశంబిడక పండె పూవుగ తాను ఫాలాక్షుసిగను
   కొండ కోనల పైన కురిపించి సుధలు గుండెలో తా గ్రుచ్చ గునపాలునాకు
   ఎండిపోవగ గుండె ఈనాడు ఇచట ఎండమావిగ మారెనీజీవితమ్ము

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.