తేటగీతి పద్య లక్షణములు

 1. ఉపజాతి రకానికి చెందినది
 2. 12 నుండి 17 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం లేదు
 5. ప్రాస యతి నియమం కలదు
 6. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 7. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.
 8. ఉదాహరణలు:
  1. దేవదేవుని చింతించు దినము దినము;
   చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
   కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
   తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
  2. అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి
   విధినిషేధ నివృత్తి సద్విమలమతులు
   సేయుచుందురు హరిగుణచింతనములు
   మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!
  3. మంద గొందల మంద నమందవృష్టిఁ,
   గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ
   జండపవన సముద్ధూత చటుల విలయ
   సమయ సంవర్త కాభీల జలధరములు.
  4. భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ!
   వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
   దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
   దర్శనం బవధి విపత్తిదశల కనఘ!
  5. చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
   నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
   దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
   గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
  6. క్షితిని గోశంబు లరసి వీక్షింపవలయుఁ
   బిదప నాలింపఁజనును గోవిదులఁ బ్రశ్న
   సేయఁదగుఁ గడుమదిని యోచింపుటొప్పు
   నెచట నెఱుఁగనిచో నేరమెంచఁగూడ
   దనుచు నే భావి లోకుల నభినుతింతు

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.