స్రగ్ధర పద్య లక్షణములు

 1. వృత్తం రకానికి చెందినది
 2. ప్రకృతి ఛందమునకు చెందిన 302993 వ వృత్తము.
 3. 21 అక్షరములు ఉండును.
 4. 33 మాత్రలు ఉండును.
 5. మాత్రా శ్రేణి: U U U - U I U - U I I - I I I - I U U - I U U - I U U
 6. 4 పాదములు ఉండును.
 7. ప్రాస నియమం కలదు
 8. ప్రతి పాదమునందు 8,15 వ అక్షరములు యతి స్థానములు
 9. ప్రతి పాదమునందు మ , ర , భ , న , య , య , య గణములుండును.
 10. ఉదాహరణలు:
  1. కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁ గెడయుం గుప్పలై; నుగ్గునూచై
   వ్రాలున్దేరుల్‌ హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్‌; శోణితంబుల్‌
   గ్రోలున్, మాంసంబు నంజుంగొఱకు, నెముకలన్గుంపులై సోలుచున్ భే
   తాలక్రవ్యాదభూతోత్కరములు; జతలై తాళముల్‌ దట్టి యాడున్.
  2. సేవించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం
   గావేరీ మధ్యసీమున్ ఘనకలుష మహాకాలకూటోగ్ర భీమున్
   దేవారిశ్రీవిరామున్ దివిజవినుత సందీపితానంత నామున్
   ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్.
  3. దండిం గోదండ కాండోద్ధత రథ హయ వేదండ దండంబుతోడన్
   దండెత్తెన్ మెండుగా నద్దనుజనికరముల్ దైవవర్గంబు మీఁదం
   జండబ్రహ్మాండభే దోచ్ఛ్రయ జయరవముల్ సర్వదిక్ క్షోభగా ను
   ద్దండప్రఖ్యాతలీలం దలపడిరి సురల్ దర్పులై వారితోడన్.
  4. నా సామర్థ్యం బసామాన్యము త్రిజగములన్ గాంచె నెంతే ప్రశస్తిన్
   నా సాటెవ్వారు హా హా నరులును గపు లీనాడు నన్ గాంచుడంచున్
   జేసెన్ నాదంబు దిక్కుల్ చెదరెడు నటులన్ జెట్టి యింద్రారి బల్మిన్
   వేసెన్ బ్రహ్మాస్త్రమంతన్ వివిధ కపులపై భీకరంబైన రీతిన్
  5. శ్రీవాణీ! నిన్ను పూజించి మనెదను సదా సేవ నే జేతునమ్మా!
   భావమ్మందుంచి యర్చింప దలచెద రమా పార్వతీ తోడ, రమ్మా!
   దేవీ! నీ నామమందే దృఢమయిన గతిన్ తీవ్ర విశ్వాసముంతున్.
   నా విశ్వాసమ్ము లోనున్న పదములవి వీణాధరీ నీవె నమ్మా!
  6. వాణీ! బ్రహ్మాణి! విద్యా! వనజభవ ముఖాబ్జాత దివ్యాసనస్థా!
   వీణాపాణీ! సువేణీ! విమల గుణగణా! వేదమాతా! శుభాంగీ!
   ఏణీనేత్రా! పవిత్రా! హిమకరవదనా! ఈప్సితార్థప్రదాత్రీ!
   క్షోణిన్ నే వ్రాలి నీ యంఘ్రుల కివె నతులన్ గూర్తు నో కీరపాణీ!
  7. తెల్లంబై శైలవిశ్రాంతిని మునియతినిం దేజరిల్లున్‌ దృఢంబై
   చెల్లెం బెల్లై మకారాంచిత రభనయయల్‌ చెంద మీఁదన్‌ యకారం
   బుల్లం బారన్‌ బుధారాధ్యు నురగశయనున్‌ యోగివంద్యుం గడున్‌ రం
   జిల్లం జేయం గవీంద్రుల్‌ జితదనుజగురం జెప్పుదుర్‌ స్రగ్ధరాఖ్యన్‌.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.