మత్తేభ పద్య లక్షణములు

 1. ఈ పద్య ఛందస్సుకే అశ్వధాటి,సితస్తవకః అనే ఇతర నామములు కూడా కలవు.
 2. వృత్తం రకానికి చెందినది
 3. ఆకృతి ఛందమునకు చెందిన 1915509 వ వృత్తము.
 4. 22 అక్షరములు ఉండును.
 5. 32 మాత్రలు ఉండును.
 6. మాత్రా శ్రేణి: U U I - U I I - I U U - I U I - I I U - U I U - I I I - U
  • పంచమాత్రా శ్రేణి: U U I - U I I I - U U I - U I I I - U U I - U I I I - U
 7. 4 పాదములు ఉండును.
 8. ప్రాస నియమం కలదు
 9. ప్రతి పాదమునందు 8,15 వ అక్షరములు యతి స్థానములు
 10. ప్రతి పాదమునందు త , భ , య , జ , స , ర , న , గ గణములుండును.
 11. ఉదాహరణలు:
  1. సప్తాశ్వరూఢుడయిసావిత్రుడీదినముసామీప్యమయ్యెమకరం
   తృప్తాత్ములయ్యిగొనితీరైనగుమ్మిడులదీవించుభూసురగణం
   ప్రాప్తించపుణ్యగతిరాజర్షిభీష్ముడటుభావించుమారణదినం
   తప్తాధికంబులకుతప్తాండుడున్ధరయుదాపైననాయనపధం
   లుప్తంబులైజనవెలోకాలమాంద్యములులోజేరవహ్నిజఠరమ్
   దీప్తోద్ధతిన్మెరయదివ్యంపుపౌష్యసిరితీరైనముగ్గురచనం
   క్లుప్తంబులైనిశలుకొండంతలైపగలుకొమ్మాకురాలుశిశిరం
   గుప్తంబులైజనినగోత్రీకులన్ఋణముగొమ్మంచుతర్పణదినం
   వ్యాప్తించగాలచిమివడ్లన్నపొంగలులవడ్డించుతీపిపచనం
   సుప్తాత్ములన్కుదుపుజోరైనశీతపువిశోకంపుభోగిదహనం
   జ్ఞప్తిన్తలంచుకొనిసాలందుమేలుపశుజాతందుపూజకనుమల్
   నప్తారపౌత్రసుతనవ్యంపుటూహలిడినాణ్యంపుబొమ్మకొలువుల్
   సప్తస్వరావళులసల్లాపముల్సలుపుసన్నాయిగంగిబసవల్
   వ్యాప్తింపనామధునివారంబురంగహరియంచేగుదాసుభజనల్
   హప్తాలపాటుయికహర్మ్యాలపైకెగిరియాడేటిగాలిపటముల్
   కోప్తాలుపాస్ట్రిలికకొండెక్కిగారెదధికోవాలకమ్మదనముల్
   ఆప్తాళిబంధుతతికానందసంగమముఆసూర్యుసంక్రమణముల్
   లిప్తల్యుగాలుగనులెక్కౌనిరీక్షణములీడేరురక్తిఫలదం
   జప్తైనబుద్ధివిడిచాకంటిసూక్ష్మతనుసాధించుగొప్పతరుణం
   క్షిప్తానకుందుమదిసిద్ధందినాత్మగనికృత్స్నమ్ము కృష్ణునిపరం ~ శ్రీ సూర్యనారాయణ సరిపల్లి గారిచే విరచితం.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.