మహాక్కర పద్య లక్షణములు

 1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
 2. 21 నుండి 28 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ఒక సూర్య , ఐదు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. ఆదివార మాదిగ ననుక్రమమున - నన్నివాసరముల నొక్కినుండు
   నాదితేయాధినాథు లేగురు నల - రారంగ నొక్కసుధాకరుండు
   నాది హరిఁ గొల్వ రెండును నాలుగు - నగు వాసరంబున నర్కుఁడైన
   నాదరంబున నెడసొచ్చునని మ - హాక్కరం బలుకుదు రార్యు లెల్ల.
  2. వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
   నారయ రెండవ నాలవచోట్ల నర్కుండయిననుం దనర్చుచుండఁ
   గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
   సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు
  3. మొదట సూర్యుండు పదపగా నింద్రుండు మొదలుగా నేవురు వరలుచుమ్డ్రు
   మెదల సూర్యుండు పిమ్మట నేగురు పురుహుతులదకంగ జంద్రుడొండు
   ముదము తోనెడ సొచ్చు మహాక్కర మొనసి కావ్యములందు నిడగ కృష్ణ

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.