మధ్యాక్కర పద్య లక్షణములు

 1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
 2. 16 నుండి 22 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు రెండు ఇంద్ర , ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. ఓజతో నిద్దఱింద్రులును నొక్కయాదిత్యుండు మఱియు
   రాజితంబుగ నిద్ద ఱమర రాజులు నొక్కసూర్యుండు
   పూజింతు రత్యంతభక్తిఁ బుండరీకాక్షు ననంతు,
   భ్రాజిల్లు బుధులు మధ్యాక్కరంబు నొప్పారఁ బల్కుదురు.
  2. కలదవి నాలుగు మధ్య కరకును చరణము చూడ,
   నిలుచును నిండగు ప్రాస నియమము చక్కని విధము
   మొలకేత్తును యెతియు నిచట మొదలుగ నాల్గవగణము
   చలుపుచు ఇంద్రులుభయులు చండాంశు రెండుమారులిక ~ శ్రీ పిరాట్ల వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారిచే విరచితం.
  3. మహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్ నిజమ్ము
   బహుబంధనములు గల్గించి పట్టిలాగుచునుండు ననుచు
   బహు విధముల వేదికపయి పల్కు ప్రగల్భాలు గాని
   మహినట్టి వాడె భార్యయెడ మసలు నెంతయు వినయమున

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.