మధురాక్కర పద్య లక్షణములు

 1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
 2. 15 నుండి 20 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలసి
   రవిసుధాకర లోచను రాజితాసన సరోజ
   రవికులేశ గొలుతురని ప్రస్తుతింతురు ధరిత్రి
   నవిరళం బగు మధురాక్కరాఖ్యచే సత్కవులు
  2. తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
   యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
   లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
   ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
  3. తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
   నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
   సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
   వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.