మంజరీ ద్విపద పద్య లక్షణములు

 1. జాతి(ద్విపదలు) రకానికి చెందినది
 2. 11 నుండి 15 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం లేదు
 5. ప్రాస యతి నియమం కలదు
 6. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 7. ప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
 8. ఉదాహరణలు:
  1. శ్రీకామినీనాధుజితదైత్యనాధు
   లోకరక్షణకృత్యులోకైకనిత్యు
   నడురాత్రి యరుదెంచెనరలోకనాధ
   కడుడస్సినాడవుకనుమోడ్తుగాక
  2. శ్రీమందిరాకారు జితదైత్యధీరుఁ
   గీర్తించుచోఁ బుణ్యవర్తనుం డనుచు
   యతిమాఱు ప్రాస మి ట్లచ్చోట నిడక
   సరసిజనాభాయ సముదగ్రసాహ
  3. సాయ నమోయంచు శబ్దమొక్కటియు
   రెండుపాదముల నీక్రియఁ బంచియిడక
   వెలయు ప్రాసములేని ద్విపద యై పరఁగఁ
   బూజింపవలయు వాక్పుష్పమంజరుల.
  4. ఇంద్రులు మువ్వురు నినుఁ డొక్కరుండు
   సాంద్రమై యొక్కొక్కచరణంబుఁ గొలువ
   నలరుఁ బద్మోదరుఁ డంచు ధీరోత్త
   ములు విస్తరింతురు ముదముతో ద్విపద.
  5. శ్రీమందిరాకారు జితదైత్యధీరు
   గీర్తించుచోఁ బుణ్యవర్తనుఁ డనుచు
   యతిమాఱు ప్రాసమిట్లచ్చోట నిడక
   సరసిజనాభాయ సముదగ్ర సాహ

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.