కందం పద్య లక్షణములు

 1. జాతి రకానికి చెందినది
 2. 6 నుండి 20 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 6. నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 7. గణ లక్షణాలు :
  1. ఒకటవ పాదమునందు మూడు 4 మాత్రలు గణములుండును.
  2. రెండవ పాదమునందు ఐదు 4 మాత్రలు గణములుండును.
  3. మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు గణములుండును.
  4. నాలుగవ పాదమునందు ఐదు 4 మాత్రలు గణములుండును.
 8. ఉదాహరణలు:
  1. పలికెడిది భాగవత మఁట,
   పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
   బలికిన భవహర మగునఁట,
   పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
  2. లోకంబులు లోకేశులు
   లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
   జీకటి కవ్వల నెవ్వం
   డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
  3. బలవంతుడనాకేమని
   పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
   బలవంతమైన సర్పము
   చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ
  4. కలఁ డందురు దీనుల యెడఁ
   గలఁ డందురు పరమయోగి గణముల పాలం
   గలఁ డందు రన్నిదిశలను
   గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
  5. మకర మొకటి రవిఁ జొచ్చెను;
   మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
   మకరాలయమునఁ దిరిగెఁడు
   మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
  6. ఇందు గలఁ డందు లేఁ డని
   సందేహము వలదు చక్రి సర్వోపగతుం
   డెం దెందు వెదకి చూచిన
   నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.