చంపకమాల పద్య లక్షణములు

 1. ఈ పద్య ఛందస్సుకే సరసీ అనే ఇతర నామము కూడా కలదు.
 2. వృత్తం రకానికి చెందినది
 3. ప్రకృతి ఛందమునకు చెందిన 711600 వ వృత్తము.
 4. 21 అక్షరములు ఉండును.
 5. 28 మాత్రలు ఉండును.
 6. మాత్రా శ్రేణి: I I I - I U I - U I I - I U I - I U I - I U I - U I U
 7. 4 పాదములు ఉండును.
 8. ప్రాస నియమం కలదు
 9. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
 10. ప్రతి పాదమునందు న , జ , భ , జ , జ , జ , ర గణములుండును.
 11. ఉదాహరణలు:
  1. పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
   మదగజవల్లభుండు మతిమంతుడు దంతయుగాంతఘట్టనం
   జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
   వదలి జలగ్రహంబు కరివాలముమూలము జీరె గోఱలన్
  2. అటజనికాంచెభూమిసురుడంబరచుంభిశిరస్సరజ్ఝరీ
   పటలముహుర్ముహుర్ లుఠదభంగతరంగమృదంగనిశ్వన
   స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలమున్
   ఘటకచరత్కరేణుకరకంపితసారముశీతసైలమున్
  3. అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగసం
   కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
   కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
   యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
  4. జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
   ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
   వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
   చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.
  5. జగదధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్
   దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
   మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
   యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?
  6. తన కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
   పనిపడి సేవసేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ
   చ్చిన మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
   సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్.
  7. త్రిభువనవంద్య గోపయువతీజనసంచితభాగధేయ రుక్‌
   ప్రభవసముత్కరోజ్జ్వల శిరస్స్థిత రత్న మరీచి మంజరీ
   విభవ సముజ్జ్వలత్పదరవింద ముకుంద యనంగ నొప్పునా
   జభములు జాజరేఫములుఁ జంపకమాల కగున్‌ దిశాయతిన్‌.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.