అంతరాక్కర పద్య లక్షణములు

 1. జాతి(అక్కరలు) రకానికి చెందినది
 2. 12 నుండి 16 అక్షరములు ఉండును.
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క చివరి అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.
 7. ఉదాహరణలు:
  1. సాగరపు తీరమున సంచరించే వేల?
   సాగరము నీ మనసు సంశయమ్మిం కేల?
   సాగర తరంగములు చంచలమ్మై తేలు
   రాగ-మయమౌ పలు వరాల సద్భావాలు!
  2. స్వర్ణమయ సంధ్య యది చంచలమ్మై పిల్చు
   వర్ణముల చిత్ర మది వైభవమ్మై నిల్చు
   కర్ణములు గీతికల కాకలీ-నాదంపు
   పూర్ణ-సుఖ మందె నహ బుద్బుదమ్మీ యింపు!
  3. కమలమిత్రుండు సురరాజగణ యుగంబు
   కమలశత్రునితోఁ జెంది కందళింప
   నమరుఁ బ్రావళ్ళు నర్థంబు నతిశయిల్ల
   నమల మగు నంతరాక్కర మబ్ధిసంఖ్య
  4. ఇనుఁ డొకండును నింద్రు లిద్దఱును నొక్క
   వనజవైరియుఁ గూడి వైభవ మొనర్ప
   గనకవస్త్రుని గృత్తకైటభుని గొల్తు
   రనుచుఁ జెప్పుదు రంతరాక్కర బుధులు.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.