ఛందం© గురించి

ద్య రచనకు ఎంతో సృజనతో పాటుగా ఛందోనియమాల (లక్షణాల) ధారణ, గణాల, యతిప్రాసల గణన ప్రక్రియపై పట్టు కూడా ఉండాలి. దానికి ఎంతో అభ్యాసం కావాలి. ఎంత అభ్యసించినా అప్పుడప్పుడు కొన్ని దోషాలు దొర్లడం సహజం. అటువంటప్పుడే వీటన్నింటినీ సరిచూడగలిగితే బావుండును అన్న ఆలోచనే ఈ సాధనం. పద్యరచన ప్రక్రియను ముందు తరాలకు అందించాలంటే ఈ తరానికి పద్యరచనకు ఉపకరించే సాంకేతిక సాధనాలను కూడా అందించాలి. అటువంటి ప్రయత్నమే తెలుగు ఛందస్సుకు పూర్తిస్థాయి సాఫ్ట్‌వేర్ తయారుచేయాలనే దృఢసంకల్పంతో, లక్ష్యంతో చేసిన ప్రయత్నం ఇది.

లో ఉన్న అతి పెద్ద సవాలు . పద్య రచనలో ఉన్న మరో గొప్ప విశేషం, ఏవిధమైన అక్షర దోషం కనుక ఉన్నటైతే గణ,యతి,ప్రాస లో ఏదో ఒకటి దోష పూరితం గా మారుతుంది. అటివంటి వాటిని చాలా సులువుగా గుర్తించగలదు.నిదర్శనాధ్యయనాలు చూడండి.

పద్య రచనలో మంచి పట్టు సాధించినవారికి[అష్టావధాన, శత, సహస్ర అవధానాలు చేసేవారికి] ఇటువంటి సాధనం అవసరం లేకపోవచ్చు. ఈ పరికర అభివృద్ధిలో అటువంటివారు పాలుపంచుకుంటే ముందు తరాలకు పద్యసాహిత్య ప్రక్రియను తీసుకువెళ్ళడంలో మానవ ప్రయత్నం చేయవచ్చు.

ను అన్ని రకాల ఛందోనియమాలను పరిగణలోకి తీసుకొని నిర్మించడం జరిగింది. దగ్గరదగ్గర వ్యక్తిగతంగా పద్యాలను సరిచూసాను. అయినప్పటికీ కొన్ని నియమాలను ప్రస్తుతానికి ఉన్న వల్లనో లేదా వల్లో దోషం కానిదానిని దోషం అనీ లేదా దోషాన్ని దోషంకాదనో చూపించే అవకాశం ఉంది. అటువంటివాటిని నాదృష్టికి తెస్తే సరిదిద్దుకోగలను. ప్రస్తుతానికి తెలుగు పద్య ఛందస్సులను గుర్తించగలదు. కు పైగా గల సంస్కృత ఛందస్సుల లక్షణాలను ఉంచడం జరిగింది.

ఉపయోగాలు:

  1. పాత తెలుగు పద్యాలను సరిచేసుకోవచ్చు. నిదర్శనాధ్యయనాలు చూడండి.
  2. కొత్త పద్యాలు రాసేవాళ్ళు దీనిని ఒక Editor గా ఉపయోగించుకోవచ్చు.
  3. తెలియని పద్యాలు ఏ రకానికి చెందినవో కనిపెట్టవచ్చు.
  4. పద్యం చెప్పిన రకానికి చెందినదో లేదో చెప్పవచ్చు.
  5. ఇది పద్యంలో వున్న తప్పులను ఎత్తి చూపడమే కాక ఎక్కడెక్కడ కలవో అర్ధమయ్యేలా చెబుతుంది.
  6. ఛందస్సు నేర్చుకోవచ్చు.పద్య లక్షణాలే కాకుండా ఉదాహరణలను(కనీసం 5 పద్యాలు ఉంచాలనేది లక్ష్యం)ఉంచాను.
  7. కొత్త ఛందస్సులు రూపొందించే వారికి ఇది సహాయపడగలదు.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.